‘బాణం’ తో హీరోగా పరిచయమయ్యాడు నారా రోహిత్. ఆసినిమా పెద్దగా ఆడలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తెలుగు దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారని,మూలాల్లోకి వెళ్లగలుగుతున్నారని ఆసినిమాతో నిరూపించాడు చైతన్య దంతులూరి. టేకింగ్, పాత్రల్ని మలిచే విధానం.. ఇవన్నీ ఆకట్టుకొన్నాయి. ఎమోషన్స్‌ని తారాస్థాయిలో చూపించే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నారా రోహిత్‌పై గౌరవం, నమ్మకం కలిగాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపుద్దిద్దుకోబోతోంది.
అవును.. ‘బాణం’ కాంబోలో మరో సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. బాణం తరవాత చైతన్య దంతులూరి ‘బసంతి’ అనే సినిమా తీశాడు. అది సరైనఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో చైతన్యకు గ్యాప్ వచ్చేసింది. ఈలోగా ఓ మంచి కథ తయారు చేసి, నారా రోహిత్‌కి వినిపించాడట. అది రోహిత్‌కి బాగా నచ్చిందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కబోతోందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. రోహిత్ ప్రస్తుతం పండగలా దిగి వచ్చాడు, కథలో రాజకుమారి సినిమాల్లో నటిస్తున్నాడు. వీటి తరవాతే… ‘బాణం 2’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.