హైదరాబాద్: బిజీయెస్ట్ హీరో అంటే అగ్రహీరోలు పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, అర్జున్ అయిఉండరని అందరికీ తెలిసిన విషయమే. వీరందరూ ఒకదాని తర్వాత మరొక చిత్రం చేస్తారని విదితమే. బీ గ్రేడ్ హీరోలలోకూడా ఇంతకుముందు నరేష్ బాగా బిజీగా ఉండేవాడు. అయితే పెళ్ళి అయిన తర్వాత ఏమయిందో, ఏమోగానీ స్పీడ్ తగ్గించాడు. ఈమధ్య బయట ఫంక్షన్లలోకూడా ఎక్కడా కనిపించటంలేదు. మరి ఈ బిజీయెస్ట్ హీరో ఎవరై ఉంటారో ఊహించారా. మరెవరో కాదు – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వరసకు కొడుకయ్యే నారా రోహిత్.
నారా రోహిత్‌కు ప్రస్తుతం చేతిలో ఐదు సినిమాలు ఉండగా, తాజాగా మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. ‘శంకర’ ఇప్పటికే రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, ‘మద్రాసి’, ‘పండగలా వచ్చాడు’, ‘సావిత్రి’, ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’, చిత్రాలు సెట్లమీద ఉన్నాయి. మరోవైపు కొర్రపాటి సాయి నిర్మాణంలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం, శ్రీను వైట్ల శిష్యుడు ప్రదీప్ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించాడు.
ఇప్పటివరకు నటించిన 7 సినిమాలలో బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో, అసుర లాంటివి పెద్ద హిట్ కాకపోయినా రోహిత్‌కు మంచి ఇమేజ్, గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో చిన్న బడ్జెట్‌తో నిర్మించాలనుకునే వారికి అతను మంచి ఛాయిస్‌గా నిలుస్తున్నాడు. మంచి వాయిస్, రూపం ఉన్న రోహిత్ స్థాయి మరో మెట్టు ఎక్కాలంటే అతనికి ఇమ్మీడియెట్‌గా కావల్సింది – ఒక సూపర్ హిట్.