ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే మూడు, నాలుగేళ్లలో ఎవరూ ఊహించనంత పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణం ప్రారంభమయిన తర్వాత ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా కనిపించనుంది. ఇక అమరావతి కోర్ క్యాపిటల్ చుట్టూ ఉండే ప్రాంతాల్లో ధరలు ఎలా పెరుగుతాయో చెప్పడం కష్టం. ఇప్పటికే అమరావతి..సమీప గ్రామాల్లో కూడా స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయడం భారంగా మారుతోంది. అమరావతికి సిద్ధం చేస్తున్న ప్రణాళికలు భారీగా ఉంటున్నాయి. ఒక్క సారి ఊపందుకుంటే ప్రైవేటు సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంతో సంబంధం లేకుండా భూములు కొనుగోలుకు ప్రయత్నిస్తాయి.
కోర్ క్యాపిటల్ కు ఇరవై కిలోమీటర్లకు అటూ ఇటూగా స్థలం ఉన్నా భవిష్యత్ లో దాని విలువ చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో నారాకోడూరు కూడా ఉంటుంది. గుంటూరు నుంచి తెనాలి వెళ్లి మార్గంలో ఉంటుంది. మంగళగిరి నుంచి తెనాలి వెళ్లే మార్గం నారా కోడూరు మీదుగానే ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో ఇటీవలి కాలంలో నాలుగు వరుసల రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు.
గుంటూరు నుంచి నారా కోడూరు వరకు రియల్ వెంచర్లు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఇళ్లు కట్టుకోవడం కష్టమేకానీ.. పెట్టుబడుల పరంగా ఉపయోగపడతాయి. కొన్ని కొన్నిచోట్ల గ్రూప్ హౌస్ ల నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్ లో అమరావతిలో ఓ ఇల్లు ఉందని చెప్పుకోగలిగేలా మధ్యతరగతి ప్రజలు కాస్త దూరంగా అయినా కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే మంచి సమయం అనుకోవచ్చు. నారాకోడూరు వైపు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.