తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లతోసమావేశం కావాల్సి ఉంది. అందు కోసమే.. ఒక రోజు ముందుగా ఢిల్లీ వెళ్లి అక్కడే బస చేశారు. కానీ తెల్లవారే సరికి ఆయన షెడ్యూల్ మారిపోయింది. హఠాత్తుగా ఆయన పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. కేంద్రం ఆదేశం మేరకే గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. అంతకు కొన్ని రోజుల ముందే..ఇద్దరు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ చర్చలు జరిపారు. ఆ నివేదికలతో ఆయన ఢిల్లీ వెళ్లారు.
హోంమంత్రి, ప్రధాని ఇద్దరూ గవర్నర్ ను కలవకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం చేసిన కారణమని భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రితో సమావేశం లో.. ఆయన కర్ణాటకలో బీజేపీకి మద్దతివ్వాలని… చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు కూడా… బహిరంగ సమావేశంలోగవర్నర్ తీరును తప్పుపట్టారు. తనపై కుట్ర జరుగుతున్న కుట్రలో గవర్నర్ కీలకంగా వ్యహరిస్తున్న అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం అప్రమత్తమయినట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రచారానికి చెక్ పెట్టడానికి గవర్నర్ తో సమావేశాలను క్యాన్సిల్ చేసుకున్నట్లు భావిస్తున్నారు.
అయితే గవర్నర్…తన నివేదికను.. హోంశాఖ ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని రాజకీయ పరిస్థితులతో పాటు.. ఏపీలో ప్రత్యేకహోదా అంశానికి సంబంధించిన విషయాలు నివేదికలో పొందు పరిచినట్లు సమచారం. గవర్నర్ పై ఇటీవలి కాలంలో… ఏపీ వ్యవహారాల్లో మీడియాలో అనేక ఆరోపణలొస్తున్నాయి. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారన్న భావం ప్రజల్లో ఏర్పడుతోంది. దీనిపై ఏపీ ప్రజల్లో మరింత వ్యతిరేకభావం పెరుగుతూండటంతో కేంద్రం గవర్నర్ ను దూరం పెట్టాలని భావించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే కొత్తగా గవర్నర్ మార్పు ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.