జగన్ రెడ్డిపై ఎన్ని కేసులు ఉన్నా ఆయన న్యాయవ్యవస్థను ధిక్కరిస్తూ కోర్టులకు హాజరు కావడం లేదు. చివరికి తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పుకుని కేసును ఎన్ఐఐకి ఇచ్చినా ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. సీఎంగాదిగిపోయినా అదే పద్దతి. అయితే ఇక ముందు అలా సాధ్యం కాదని.. కోర్టులకు హాజరు కావాల్సిందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. దీనికి మాజీ మంత్రి నారాయణ కారణం అవుతున్నారు.
జగన్ రెడ్డికి ఐదేళ్ల పాటు పాస్ పోర్టు కావాలంటే ఖచ్చితంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లి రూ. ఇరవై వేల పూచికకత్తు స్వయంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత మంత్రి నారాయణ.. తాను మంత్రిగా లేనప్పుడు తనపై తప్పుడు ప్రచారాలు చేసినందున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. అది విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసులో కోర్టు జగన్ పాస్ పోర్టును ఏడాదికే అనుమతి ఇచ్చింది. దీనిపైనే జగన్ కోర్టుకెళ్లారు. ఐదేళ్ల పాస్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.. మిగతా షరతులన్నీ వర్తిస్తాయని స్పష్టం చేసింది. స్వయంగా కోర్టుకు వెళ్లి పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.
జగన్మోహహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోయాక స్వయంగా కోర్టుకు హాజరవడం ఇదే మొదటి సారి. ఇక నుంచి రెగ్యులర్ గా ఆయన షెడ్యూల్స్ కోర్టుల చుట్టూనే ఉంటాయని అనుకోవచ్చు. ఎందుకంటే.. దేశంలో ఏ రాజకీయ నేతపై కూడా లేనన్నికేసులు జగన్ పై ఉన్నాయి. అవి ఆషామాషీ కేసులు కావు. పైగా వ్యవస్థల్ని ప్రభావితం చేసి విచారణలను ఆలస్యం చేస్తన్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.