భారతీయ జనతా పార్టీతో కలిసి లోపాయికారీ ఒప్పందంతో.. టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగిందని వస్తున్న విమర్శలకు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… నిజామాబాద్లో తనదైన శైలిలో చరిత్రను కలిపి… కౌంటర్ ఇచ్చారు. అప్పుడెప్పుడో.. యూపీఏ హయాంలో.. కేసీఆర్ కేంద్రమంత్రిగా పని చేశారని గుర్తు చేసి.. యూపీఏ తిన్న వ్యక్తిగా కేసీఆర్ను అభివర్ణించింది.. కాంగ్రెస్తో ఆయన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీనే.. కేసీఆర్కు అసలైన ప్రత్యర్థి చెప్పుకోవడానికి..మోడీ తాపత్రయపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరు కాదన్నారు. రెండూ కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. బీజేపీ – కాంగ్రెస్ నేతలది దొంగాట అని మండిపడ్డారు.
కేసీఆర్ పై మోడీ తీవ్ర విమర్శలే చేశారు. కేసీఆర్.. ఉప్పు, నిమ్మకాయల్ని మాత్రమే నమ్ముతారంటూ ఎద్దేవా చేశారు. బహుశా.. ముహుర్త బలం ప్రకారమే.. తనకు ఎన్నికల షెడ్యూల్స్, అసెంబ్లీ రద్దు తేదీలు కావాలని ఒత్తిడి చేసిన విషయాన్ని ప్రధానమంత్రి ఇలా గుర్తు చేసి ఉండవచ్చు. కాంగ్రెస్లో ట్రైనింగ్ తీసుకున్న కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని మండిపడ్డారు. అభద్రతా భావంతో ఉన్న కేసీఆర్ను.. తొమ్మిది నెలలు ముందుగానే ఇంటికి పంపించే అవకాశం వచ్చిందని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని… ఆయన కాంగ్రెస్ మార్క్ అభివృద్ధి చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ , కరీంనగర్లను లండన్ చేస్తామన్నారని..కానీ.. నగరాలను నాశనం చేశారని విమర్శించారు. మోడీ.. పార్లమెంట్లో .. కేసీఆర్ను పొగిడిన దానికి భిన్నంగా… గట్టిగానే టీఆర్ఎస్ను విమర్శించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్తో బీజేపీకి ఏ సంబంధం లేదని చెప్పుకోవడానికి తాపత్రయ పడ్డారు.
బీజేపీ గురించి కూడా గొప్పగా చెప్పారు. ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ల గురించి చెప్పారు. కేంద్ర పథకాల గురించీ చెప్పుకొచ్చారు. కానీ..తెలంగాణ విభజన హామీల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జాతీయ అంశాలను కూడా ప్రస్తావించారు. విశేషం ఏమింటటే… చంద్రబాబు పేరు కానీ.. టీడీపీ పేరు కానీ.. మోడీ ఎత్తలేదు. ఇప్పటికే ఆంధ్రా ఓటర్లు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న సమాచారం ఉండటంతో.. వీలైనంత వరకూ.. టీడీపీ ప్రస్తావన లేకుండా..మోడీ ప్రసంగం ముగించాలని.. అనుకున్నట్లుగా.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.