కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో కొన్ని దేశాలు పడుతున్న ఇబ్బందుల్ని చూసిన తర్వాతనే.. లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఆయన ఆల్ ఇండియా రేడియోలోని ఆయన ప్రసంగం కార్యక్రమం మన్‌కీ బాత్ లో మొత్తం ఈ అంశంపైనే మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని.. జీవన్మరణ పోరాటంలో గెలవాల్సిన అవసరం ఉందన్నారు. రోజు కూలీలు పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనని.. తనను క్షమించాలని నిర్మోహమాటంగా కోరారు.
లాక్డౌన్ ఎవరినో రక్షించడానికి కాదని.. ప్రజలు తమను తాము రక్షించుకుంటూ.. తమ కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తున్నామని మోడీ ప్రకటించారు. కొంత మంది నాన్ సీరియస్‌గా ఊంటూ రోడ్ల మీదకు వస్తున్న విషయంపై.. కూడా మోడీ స్పందింారు. వైరస్ ఎ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదని.. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా… ఇతరులకు ఇబ్బందేనని మోడీ అన్నారు. వైరస్‌కు పేద, ధనిక తేడా ఉండదని.. కరోనాపై మనం చేస్తున్న యుద్ధం గెలిచి తీరాల్సిందేనన్నారు. ప్రభుత్వం విధించిన లక్ష్మణరేఖను ఎవరూ దాటొద్దని స్పష్టం చేశారు. కరోనాకు మందు లాక్ డౌన్ మాత్రమేనని స్పష్టం చేశారు.
అందరూ ఏకమై కరోనాపై యుద్ధం చేయాలని పిలుపు ఇచ్చారు. లక్ష్మణరేఖను కొన్నాళ్ల పాటు దాటవద్దని హెచ్చరికలు చేశారు. నరేంద్రమోడీ తన ప్రసంగంలో .. కరోనా కారణంగా నిర్విరామంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది.. అత్యవసర సేవల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు