ఎన్నికల్లో గెలిచిన వెంటనే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి దేశ ప్రజలకు ఒక్కోక్కరికి రూ. 15 లక్షల చొప్పున బ్యాంక్ అకౌంట్లలో వేస్తానని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పారు. అధికారంలోకి రాగానే అందరి చేత .. అకౌంట్లు తెరిపించారు. ఇక అందరూ… అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయో అని కాచుకు కూర్చున్నారు. ఇంత వరకూ పడినట్లు మెసెజులు కూడా రాలేదు.. అయితే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి .. దేశ ప్రజలకు ఓ మెసెజ్ వచ్చింది. అదేమిటంటే… ఈ నాలుగున్నరేళ్ల కాలంలో.. దేశ ప్రజల అకౌంట్లలో నేరుగా… రూ.5.8 లక్షల కోట్లు జమ చేశారట. బిత్తర పోకండి. ఇది నిజం. మీ అకౌంట్లలో పడ్డాయేమో అని ఏటీఎంల వద్దకు పరుగులు తీయకండి.. ఎందుకంటే.. ఆ మాట చెప్పింది నరేంద్రమోడీ కదా..!
వారణాశిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అరవయ్యేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అవినీతి నిర్మూలనకు ఏమీ చేయలేదని తాను అధికారంలోకి వచ్చిన 85 శాతం మేర అవినీతిని అంత మొందించేశానని ప్రకటించుకున్నారు. ఈ అవినీతిని అంతమొందించడం వల్ల మిగిలిన రూ.5.8 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేసినట్లు ప్రకటించారు. అదే నేరుగా నగదు బదిలీ చేసి ఉండకపోతే.. ఆ మొత్తం అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లిపోయి ఉండేవట. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ.. నేరుగా ఎవరి అకౌంట్లలో ఈ మనీ పడ్డాయి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు.. ఎంత మంది అకౌంట్లలో పడ్డాయి..? ఇలా నగదు బదిలీ చేసి ఉంటే.. అలా నగదు పొందిన వారిని బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోకుండా ఉంటుందా..? లాంటి అనుమానాలు అందరికీ వస్తాయి.
రూ. 15 లక్షలు బ్యాంకు అకౌంట్లో వేస్తామని.. చెప్పి.. ఆ తర్వాత దాన్ని ఓ జుమ్లాగా పేర్కొన్న బీజేపీ నేతలు.. . ఈ విషయంలో ప్రజలు ఓటుతో బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలిసి.. కొత్త జిమ్మిక్కులు స్టార్ట్ చేశారనే అభిప్రాయం కలుగుతోంది. కాంగ్రెస్ హయాంలో రూ. 400లోపు ఉండే గ్యాస్ ధరను.. రూ. 1000కి చేసేసి.. సబ్సిడీ కింద .. ఒక్కో సిలిండర్ కు రూ. 180 ఇస్తున్నారు. దేశంలో నేరుగా పేదలకు బదిలీ చేస్తున్న నగదు ఇదొక్కటే. దీనికే.. ఇన్ని లక్షల కోట్లన్నీ మోడీ లెక్క చెబుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. మొత్తానికి మోడీ… తన ఎన్నికల హామీ… ప్రతి ఒక్కరికి రూ. 15 లక్షలు జుమ్లా కాదని .. నెరవేర్చేశానని మోదీ చెప్పేశారన్నమాట.