చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ అందర్నీ ఆకట్టుకున్నారు. మంత్రులెవరో తనకు పెద్దగా తెలియకపోయినా ఆప్యాయంగా మాట్లాడారు. కాస్త తెలిసిన వారయితే.. చిరు సంభాషణ జరిపారు. ఎవర్నీ పాదాభివందనం చేయనివ్వలేదు. అంతే కాదు..ఆయన ప్రధాని అనే భేదం లేకుండా కలసిపోయే విధానం కూడా అందర్నీ ఆకట్టుకుంది. వేదికపై వచ్చినప్పటి నుండి.. పాతిక మంది ప్రమాణం చేసి వస్తే.. అన్ని సార్లు లేచి నిలబడి వారికి ప్రతి మనస్కారం చేశారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత మోదీ వ్యవహారశైలి అందర్నీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి స్టేజ్‌కు అవతల వైపు ఉన్నారని … వస్తారని పవన్ కల్యాణ్ అడగగానే.. ఆయన రావడం ఎందుకు మనమే వెళదామని చేయి పట్టుకుని తీసుకెళ్లిన సీన్ హైలెట్ అయింది. చిరంజీవితో కలిసి మోదీ రెంు చేతులు ఎత్తి అభివాదం చేయడం అనూహ్యంగా జరిగిపోయింది. తర్వాత రజనీకాంత్ తోనూ మాట్లాడారు. అందరితో గ్రూప్ ఫోటో దిగారు.
మోదీ అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. బాలకృష్ణతో సహా తనకు తెలిసినా.. తెలియని నేతల్ని కూడా ఏ మాత్రం చిరాకు లేకుండా రిసీవ్ చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి అగ్రనేతలంతా.. వేదికపై ఉన్నారు. నిజానికి మోదీ ఇక్కడ ప్రమాణం ముగించుకుని ఒడిషా వెళ్లి అక్కడ తమ సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలి. అందు కోసం ఎలాంటి తొందరపాటు ప్రదర్శించలేదు. మొత్తంగా మోదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిధిగానే కాదు.. అందర్నీ ఆకట్టుకున్న నేత అయ్యారు.