భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కరోనా కష్టాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పడానికి రాజకీయ కార్యాతచరణ ప్రారంభించింది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో విఫలమయ్యాయని ఆందోళనలు చేయాలంటూ కార్యక్రమాన్ని ఫిక్స్ చేశారు. ఏపీ బీజేపీ నేతలు ఈ అంశంలో… ఎలా చేసినా… ముందు ఉన్నారు. ఈ రోజు తమ తమ ఇళ్లలోనే బీజేపీ నేతలు ధర్నాలు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ధర్నాకు కారణంగా ఏపీ సర్కార్ కరోనా కట్టడిలో దారుణంగా విఫలమవడమేనట. ఏపీ సర్కార్ అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. కేంద్ర నిధుల్ని వాడుకుంటున్నారు కనీ…దానికి తగ్గట్లుగా చర్యలు లేవని ఆరోపిస్తున్నారు. తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు సూచనలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిజానికి ఏపీ బీజేపీ ఇలాంటి ప్రోగ్రాం ఒకటి పెడుతుందని కానీ… ప్రభుత్వ తీరుపై ధర్నాలు చేస్తున్నారని కానీ పెద్దగా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో ఆ పార్టీని ఫాలో అయ్యే అతికొద్ది మందికి మాత్రమే వారి ధర్నాల గురించి తెలిసింది. ఇప్పటికే ప్రధానమైన మీడియాను దూరం చేసుకున్నారు. ఓ వర్గం మీడియా .. బీజేపీ నేతలు.. టీడీపీ పై చేసే విమర్శలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెపట్టే ఏ కార్యక్రమానికీ స్పేస్ ఇవ్వదు. ఇక అందరికీ స్పేస్ ఇచ్చే ఈటీవీ, ఈనాడులో మాత్రం.. కాస్తంతస్పేస్ బీజేపీకి లభిస్తుంది. దాని ద్వారానే.. వారి ధర్నాల విషయం బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో సైతం.. సరైన ప్రమోషల్ లేకపోవడంతో వారి ధర్నాలు ఫోటోలు తీసుకుని హైకమాండ్‌కు పంపించడానికే అన్నట్లుగా కార్యక్రమాలు చేస్తున్నారు.
నిజానికి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల్ని టార్గెట్ చేసి.. తమ తప్పేం లేదని వాదిస్తే… ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కరోనా వైరస్ రాష్ట్ర అంశంగా కన్నా… కేంద్ర అంశంగానే ఎక్కువ మంది చూస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసి .. ప్రజల్ని కాపాడాల్సింది పోయి.. చేతులెత్తేసి బ్లేమ్ గేమ్ ప్రారంభించడం… చాలా మందిని నివ్వెర పరుస్తోంది. కేంద్రం, రాష్ట్రం బాగానే రాజకీయ స్నేహం చేస్తూ.. ప్రజలకు ఉపయోగపడే విషయంలో మాత్రం.. ఎవరికీ వారు అన్నట్లుగా ఉంటున్నారు. దీని వల్ల ఏపీ ప్రజలు విపరీతంగా నష్టపోతున్నారు. కానీ వారు మాత్రం తమదైన రాజకీయం తాము చేసుకుంటున్నారు.
బీజేపీ నాయకుల పోరాటంపై ఇప్పటికే విమర్శలు ప్రారంభమయ్యాయి. నిన్నామొన్నటిదికా ప్రతీ అంశంలోనూ… కరోనాను గెలిచిన మోడీ అంటూ ప్రచారం చేసుకున్నారని ఇప్పుడేమో… వైఫల్యమని రాష్ట్రాల ఖాతాల్లో వేస్తున్నారని.. ఇతర పార్టీల నేతలు విమర్శలు ప్రారంభించారు. ఇందులో కొంత సహేతకత కూడా ఉంది. కానీ ప్రశ్నించాల్సిన వాళ్లు మాత్రం ప్రశ్నించకపోవడంతో బీజేపీ వాదనకు సరైన కౌంటర్ పడటం లేదు.