దేశంలో కొత్తగా లేటరల్ ఎంట్రీ అంటూ కొత్త వివాదం ప్రారంభమయింది. లేటరల్ఎంట్రీ పేరుతో ఐఏఎస్ లు చేసే ఉద్యోగాల్లో వృత్తి నిపుణులను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది ఐఏఎస్ వ్యవస్థకు ప్రత్యామ్నాయమేనని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడీ వివాదం ముదురుతోంది.
24 మంత్రిత్వ శాఖలలో కీలక బాధ్యతలు నిర్విహంచే 45 పోస్టులకు ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా కేంద్ర ప్రభుత్వం భర్తీ ప్రక్రియ చేపట్టింది. వీరు యూపీఎస్సీ ద్వారా ఎంపికయిన వారు కాదు.. ఆయా రంగాల్లో నైపుణ్యం, అనుభవం ఉన్న బయట వారితో భర్తీ చేస్తున్నారు. నిజానికి కీలక బాధ్యతల్లో నిపుణులను నియమించుకోవాలన్న నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం 2018లోనే చేసింది. కానీ భారీగా నియామకాలు చేపట్టాలని మాత్రం ఇప్పుడే నిర్ణయించుకుంది.
జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీ, డైరెక్టర్ల స్థాయిలో లేటరల్ ఎంట్రీ పోస్టులు భర్తీ చేస్తున్నారు . నైపుణ్యం గలవానికి ప్రభుత్వంలోకి ఆహ్వానంచడం.. ఐఏఎస్ల కొరతను అధిగమించడానికని కేద్రం చెబుతోంది. కానీ లేటరల్ ఎంట్రీ పోస్టుల ఎంపికకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. అందుకే విపక్షాలు ప్రశ్నించడజం ప్రారంబించాయి. రిజర్వేషన్లపై బీజేపీ చేస్తున్న దాడి అని మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు. తేజస్వి యాదవ్ రాజ్యాంగంపై ”డర్టీ జోక్” అని మండిపడ్డారు. ఖాళీలు ఉంటే యూపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలన్న డిమాండ్ ను వీరు వినిపిస్తున్నారు.
ఈ వివాదం ముందు ముందు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. యువత తమ తమ అవకాశాల్ని కాలరాస్తున్నారని భావిస్తే.. రోడ్డెక్కుతారు. అలాంటి పరిస్థితి రాకుండా పద్దతిగా కేంద్రం వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది.