ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావలసి ఉంది. కానీ ఆఖరు నిమిషంలో వారి సమావేశం వాయిదాపడింది. ఈ నెలాఖరున చివరి నాలుగు రోజుల్లో ఏదో ఒకరోజు డిల్లీకి ప్రధానమంత్రితో సమావేశం ఏర్పాటుచేస్తామని ప్రధాని కార్యాలయం నుండి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక మెసేజ్ వచ్చింది. కనుక ఈరోజు సాయంత్రం డిల్లీ వెళ్దామని భావించిన చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవలసివచ్చింది. ఈ సారి డిల్లీ వెళ్లి అక్కడే రెండుమూడు రోజులు ఉండి ప్రత్యేక హోదాతో సహా మిగిలిన హామీలపై కూడా కేంద్రప్రభుత్వం చేత ఒక నిర్దిష్ట ప్రకటన చేయించాలని ఆయన భావించారు. కానీ అంతలోనే అనివార్య కారణాల వలన వారి సమావేశం వాయిదాపడింది. మోడీ నిన్న బీహార్ రాష్ట్రానికి రూ. 1.65 లక్షల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినందున చంద్రబాబు నాయుడు కూడా అంతకంటే ఎక్కువకావాలని డిమాండ్ చేసినట్లయితే ఆయనకీ ఏవిధంగా సముదాయించాలి? ఏమేమీ తక్షణం మంజూరు చేయాలి అనే విషయాల గురించి ఆలోచించుకోనేందుకే బహుశః ఈ సమావేశం వాయిదా వేసి ఉండవచ్చును.