ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం తీరు ఎబ్బెట్టుగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఫోటో షూట్లపై చర్చలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తాగ సెల్ఫీల ప్రచారం చేస్తున్నారు. యువతలో ఉన్న సెల్ఫీ మోజును, అలవాటును ఉపయోగించుకుని ప్రచారం పొందేందుకు మోడీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కళాశాలలకు ఒక సర్కులర్ జారీ చేసింది. అదేమంటే భారతదేశం పలు రంగాల్లో సాధించిన విజయాలపై యువతలో అవగాహన కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 3డీ ఫోటో తో కూడిన సెల్ఫీ పాయింట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలని ాదేశించింది. అందరూ ఇదేమిటని ప్రశ్నించడంతో యూజీసీ వెనక్కి తగ్గింది.
ఇప్పుడు సెంట్రల్ రైల్వేశాఖ తమ 19 జోన్లలో వున్న స్టేషన్లలో 3డి మోడీ సెల్ఫీ బూత్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏర్పాటూ మొదలయింది. ఒక్కో సేల్ఫీ పాయింట్‌కు ఆరు లక్షలు ఖర్చు చేశారు. సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు రైళ్ళను పెంచక పోగా అనేక రైళ్లను రద్దు చేశారు. కిక్కిరిసిన ప్రయాణాలతో జనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సదుపాయాలు పెంచటంలేదు. కానీ కోట్ల రూపాయలతో సెల్ఫీ ప్రచారాలు చేసుకుంటున్నారు.
రక్షణ శాఖ కూడా తమ విభాగాలకు సెల్ఫీ పాయింట్లు పెట్టాలని సూచనలు జారీ చేసింది. ఎయిర్ పోర్టులు, మ్యూజియమ్లు, మార్కెట్లు, స్కూల్సు, పర్యాటక కేంద్రాలలో మోడీ బొమ్మతో 3డి ఎఫెక్ట్ తో ఈ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. లక్ష్వద్వీప్ తీర ప్రాంతంలో నీటిలో విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. ఒక వైపు మణిపూర్ మండుతునే వుంది. సామాన్యుల బాధలు పెరుగుతూనే ఉన్నాయి. నిరుద్యోగ భారతం పెరుగుతోంది. దారిద్య్రం పైపైకి పోతోంది. ప్రజాస్వామ్యం అడుక్కి పోయి నియంతృత్వం పెరిగి పోగోంద. తిండికి విలవిల్లాడుతున్న జనం ఒక వైపు ..మోదీ ప్రచార భేరీ మరో వైపు దేశంలో కనిపిస్తోంది.