ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజీనామా చేయాలంటూ..రెండు రోజుల నుంచి ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. #Resign_PM_Modi ji పేరుతో కొన్ని లక్షల ట్విట్లు… పోటెత్తుతున్నాయి. దీనికి కారణం .. ఇండియాలో కోవిడ్ విజృంభణకు ఆయనే కారణం అని.. అందరూ మనస్ఫూర్తిగా నమ్ముతూండటమే. కరోనా నిర్మూలన చేత కాకపోవడం వేరు… కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా కారణం అవడం వేరు. పరిస్థితుల్ని అంచనా వేయకుండా.. నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా.. ఇండియా ప్రజలను లైట్ తీసుకుని.. తన పేరు కోసం.. ఆయన ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు.. ఆక్సిజన్.. ఇంజెక్షన్లు పంపిణీ చేశారన్న విమర్శలు సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి.
అంతర్జాతీయ మీడియాలో నరేంద్రమోడీ ఘనకార్యాల గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో.. ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో మోడీపై వ్యతిరేక పోస్టులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ట్విట్టర్‌పై తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. కేంద్రం.. మోడీకి వ్యతిరేకంగా కనిపించే పోస్టుల్ని ఫిల్టర్ చేయడానికితాను చేయాలనుకున్నదంతా చేస్తోంది.కానీ వెల్లువెత్తుతున్న పోస్టుల ముందుఅవి సరిపోవడం లేదు. ఒక్క రోజులో ఇరవై లక్షల మంది నెటిజన్లు.. మోడీ రాజీనామాను డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇది దేశంలో కరోనా పరిస్థితిని నిర్లక్ష్యం చేసిన మోడీపై కోపంతోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో.. పీకల మీదకు కరోనా పరిస్థితి తెచ్చిన తర్వాత కూడా.. ఆయన ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం… సరైన చర్యలు తీసుకోకపోవడం వంటివి.. ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
అందుకే ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్లో బీజేపీకి తిరుగులేదు. అలాంటి బీజేపీకి ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. అయితే నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ చేసినంత మాత్రాన ఆయన రాజీనామా చేయాలా.. చేస్తారా.. అన్న ఓ ప్రశ్న.. అదే సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే.. హ్యాష్ ట్యాగ్ ఉద్దేశం నిజంగా మోడీని రాజీనామా చేయమనడం కాదని.. ఆయన తీరుపై నిరసన వ్యక్తం చేయడమేనని చెబుతున్నారు. మొత్తానికి మోడీ .. తనకు వ్యతిేరకంగా ఎలాంటి ప్రచారం సోషల్ మీడియాలో చర్యలు తీసుకున్నా.. దానికి రెండింతలు ఎక్కువ ప్రచారం జరుగుతోంది కానీ.. కట్టడి చేయలేకపోతున్నారు.