ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్ష నేతలకు ఫోన్లు చేశారు. దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న సమయంలో… తీసుకంటున్న చర్యలు వివరించి సలహాలను కోరారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభాపాటిల్‌లతో పాటు… మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడలతో పాటు మమతా బెనర్జీ, కేసీఆర్, ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, నవీన్ పట్నాయక్ , కేసీఆర్ , ప్రకాష్ సింగ్ బాదల్‌లకు ఫోన్లు చేశారు. లాక్ డౌన్ పరిస్థితులును అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు,సూచనలు చెప్పాలని కోరారు. ఇంత మందితో మాట్లాడినా…ప్రధాని కాల్ చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చోటు దక్కలేదు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబులాంటి టాస్క్ మాస్టర్ అవసరం ఉంటుందని..సోషల్ మీడియాలో టీడీపీ నేతలు చాలా ప్రచారం చేశారు. అయితే ప్రధానమంత్రి మాత్రం.. చంద్రబాబును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్‌కు…నవీన్ పట్నాయక్‌కు.. చివరిరి శిరోమణి అకాలిధళ్ నేతకుకూడా ఫోన్ చేసినా..చంద్రబాబుతో మాట్లాడేందుకు సిద్ధపడలేదు. ఏ ప్రాతిపదికన చూసినా పధ్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి..ఓ ముఖ్య రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉన్న నేత సలహాలను తీసుకోవడానికి ప్రధాని సిద్ధపడలేదు.
దీనికి రాజకీయ కారణాలో..లేకపోతే.. చంద్రబాబు చెప్పే మాటల వల్ల ఉపయోగం లేదని ముందుగానే డిసైడ్ అయిఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు.. విపక్ష పార్టీలతో ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.లాక్ డౌన్ పరిస్థితులు.. కరోనా ను ఎదుర్కోవడం… పేదలకు సాయం చేయడం.. ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.