ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనలో నారా లోకేష్‌పై ప్రత్యేక అభిమానం చూపించడం హాట్ టాపిక్ గామారింది. ఎన్నికల తర్వాత ఆరు నెలల నుంచి తనను కలవడానికి రాలేదేమని ఆయన ప్రశ్నించారు. కుటుంబంతో సహా వచ్చి కలవాలని సూచించారు. స్టేజ్‌పై కూడా లోకేష్‌తో మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతూ కనిపించారు.
చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో నారా లోకేష్ జాతీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. టీడీపీ తరపున చాలా వ్యవహారాలు ఢిల్లీలో లోకేష్ చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో గతంలో మోదీతోనూ సమావేశమయ్యారు. ఈ క్రమంలో లోకేష్ పై మోదీ ప్రత్యేక ఆప్యాయత చూపిస్తున్నారు. మోదీ పర్యటనకు ఇంచార్జ్ గా నారా లోకేష్ ను నియమించడం వెనుక కూడా ..ఢిల్లీ నుంచి అత్యున్నత స్థాయి వర్గాల నుంచి వచ్చిన సూచనలు ఉన్నాయంటున్నారు.
నారా లోకేష్ త్వరలోనే మోదీతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు నారా లోకేష్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు జరిపారు. అమిత్ షాతో రెండు, మూడు సార్లు సమావేశం అయ్యారు. కొన్ని పర్యటనలు పూర్తయ్యే వరకూ బయటకు తెలియలేదు. అయితే ఆయన ప్రధానితో సమావేశం కాలేదని తాజా స్పందనతో అర్థమవుతోంది. చాలా మంది ప్రయత్నం చేస్తున్నా అపాయింట్మెంట్లు దొరకవు కానీ.. నారా లోకేష్‌కు మాత్రం ప్రధాని స్వయంగా వచ్చి కావాలని పిలుపునిచ్చారు.