ప్రధాని స్థాయిని తగ్గించే మరో ప్రకటనను… నరేంద్రమోదీ చేశారు. ఓ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ తృణమూల్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని..మమతా బెనర్జీకి హెచ్చరికలతో కూడిన బెదిరింపులు పంపారు. నాలుగో విడత పోలింగ్… బెంగాల్లో జరుగుతున్న సమయంలోనే…ఈ ప్రకటన చేశారు. తృణమూల్ ఎమ్మెల్యేల గురించి మోదీ ప్రకటన… దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనాన్నే నమోదు చేసింది. దీనికి కారణం.. బీజేపీ గత చరిత్ర ఒకటి అయితే.. ప్రధాని స్థాయి వ్యక్తి.. అంత బహిరంగంగా.. ఫిరాయింపుల గురించి… ప్రస్తావించి .. ఇతర పార్టీలను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడటం మరో కారణం. భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వాలను కబ్జా చేస్తుందని.. గత నాలుగైదేళ్లలో…జరిగిన అనే ఘటనలు నిరూపించాయి.
దేశానికి ఓ రాజ్యాంగం ఉంది. ప్రజలెన్నుకున్నవారే ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. రాజ్యాంగం ప్రకారం..మెజార్టీ ప్రజల అభిప్రాయమే కీలకం. కానీ .. బీజేపీ.. అధికార బలంతో.. ఓ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను భయపెట్టో, బెదిరించో.. మరో కారణం చూపో… తిరుగుబాటు చేసేలా ప్రొత్సహించడం… ప్రభుత్వాలను కూల్చడం అదే పనిగా పెట్టుకుంది. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత.. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడయిన తర్వాత ఇలాంటి ఆపరేషన్లు ఊపందుకున్నాయి. ముందుగా ఈశాన్య రాష్ట్రాలను గురి పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని… ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చికూల్చి వేశారు. కాంగ్రెస్ రెబల్ అయిన.. కలికోఫుల్ అనే ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని చేశారు. కానీ.. బీజేపీ అసలు లక్ష్యం వేరు కాబట్టి.. కలికోఫుల్ కూడా ఎక్కువ కాలం సీఎంగా ఉండలేకపోయారు. తనను పావుగా వాడుకుని చేసిన రాజకీయాన్ని తట్టుకోలేక కలికోఫుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసుకున్న డైరీల్లో సంచలన విషయాలున్నాయి. కానీ.. ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి..
పార్టీ ఫిరాయింపులను… ప్రొత్సహించడానికి.. తాము ఏ మాత్రం వెనుకాడబోమని..నేరుగా మోదీనే ప్రకటించినట్లయింది. తమకు నచ్చని ప్రభుత్వాలు ఉంటే… కూల్చివేస్తామని.. నేరుగా చెప్పినట్లయింది. ఇప్పటికే.. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చడానికి.. బీజేపీ నేతలు.. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆఫర్లు ఇస్తూ.. ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఎమ్మెల్యేలకు బేరాలు పెడుతున్న వారు కూడా.. మోదీ, అమిత్ షాల ప్రస్తావన తెస్తున్నారు. కర్ణాటక ఎపిసోడ్ అలా నడుస్తూండగానే.. మోదీ బెంగాల్ సర్కార్ పై.. కన్ను వేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.