ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా వెళ్తున్నానంటూ సంచలన ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బీజేపీ శ్రేణులకు షాక్కు గురి చేసింది. అసలు మోదీ ఎందుకు సోషల్ మీడియా వద్దంటున్నారంటూ ఆసక్తికర చర్చ ప్రారంభమైంది.. ఈ సమయంలో మోదీ క్లారిటీ ఇచ్చారు. అది కేవలం మహిళల కోసమేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం రోజు.. మహిళా దినోత్సవం.. మనల్ని ఇన్స్పైర్ చేస్తున్న మహిళలకు నేను నా సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు అప్పగిస్తా అంటూ మోదీ ట్వీట్ చేశారు.
అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుందని చెబుతున్నారు. మీరు అలాంటి మహిళే అయితే వారి స్టోరీలను #SheInspireUsతో ట్యాగ్ చేయండి అని పిలుపునిచ్చారు. చాలా మందిని స్ఫూర్తినిచ్చే మహిళలు.. మోదీ సోషల్ మీడియా అకౌంట్లను ఒక రోజు పాటు నిర్వహిస్తారు. ఇదే షీ ఇన్స్పైర్స్ అస్ వెనుక అసలు విషయమని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడమే కాదు.. ఇలాంటి గాధలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెబుతున్నారు. ఇదే మోదీ ట్వీట్ వెనుక పరమార్థమని అంటున్నారు బీజేపీ నేతలు.
ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నట్లుగా ట్వీట్ చేసినప్పుడు ఆయన అభిమానులు, పార్టీ నేతలు షాక్కు గురయ్యారు. చివరికి అది ఓ ప్రాంక్గా భావించాల్సి వచ్చింది. మోడీ సోషల్ మీడియా అకౌంట్లు ఆయన నిర్వహించారు. ఆయన తరపున ఓ ఏజెన్సీ నిర్వహిస్తుంది. అది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ ఏజెన్సీ ఆదివారం రోజు.. లేడీస్ స్పెషల్ నిర్వహిస్తుంది. అంతే తేడా..!