కథలో కలుగజేసుకుంటారని, స్ర్కిప్ట్ వర్క్‌లో చేతులు పెడతారని, మేకింగ్‌లో తమ మాట నెగ్గాలని పట్టుబడతారని సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలపై విమర్శలు వస్తుంటాయి. ఆ జాబితాలో సునీల్, నరేశ్ పేర్లు కొన్నిసార్లు వినిపించాయి. ఆ మాటల్లో నిజానిజాలు ఎంత? అనే అంశం పక్కన పెడితే… తాజా ‘సిల్లీ ఫెలోస్’ స్ర్కిప్ట్ వర్క్‌లో ‘అల్లరి’ నరేశ్, సునీల్ ఇన్వాల్వ్మెంట్ వుందని నిర్మాతలు అంగీకరించారు. ఈ హీరోలు అంటే పడని వాళ్లు దర్శకుడి పనిలో జోక్యం చేసుకున్నారని అంటారేమో! నిర్మాతలు మాత్రం తమకు స్ర్కిప్ట్ వర్క్‌లో ఇద్దరూ ఎంతో సహకరించారని చెప్పారు. భీమనేని దర్శకత్వంలో సినిమా చేయడానికి తమ సమ్మతి తెలిపాక… ఆరుగురు రచయితలతో కూర్చుని నరేశ్, సునీల్ స్ర్కిప్ట్ వర్క్ చేయించార్ట! పదిహేను రోజుల పాటు ప్రతిరోజూ నిర్మాతల ఆఫీసులో స్ర్కిప్ట్ డిస్కషన్స్‌లో పాలు పంచుకున్నార్ట! స్వయంగా నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ సంగతి చెప్పారు. స్ర్కిప్ట్ వర్క్‌లో నరేశ్, సునీల్ ఇన్వాల్వ్మెంట్ తమకు ఎంతో హెల్ప్ అయ్యిందని, వాళ్లిద్దరూ ఎంతో మద్దతుగా నిలిచారని తెలిపారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు!!