అల్లరి నరేష్, సునీల్ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. ఇదో తమిళ చిత్రానికి రీమేక్. ఇది వరకు ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ ఈ సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. అయితే… ఇప్పుడు టైటిల్ మారినట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘ఫన్ రాజా ఫన్’ అనే పేరు పెట్టార్ట. భీమనేని శ్రీనివాసరావు – నరేష్ కాంబినేషన్లో వచ్చిన ‘సుడిగాడు’ సూపర్ డూపర్ హిట్. ఆ తరవాత.. అటు భీమనేనికీ, ఇటు నరేష్కీ హిట్టు దక్కలేదు. సునీల్ పరిస్థితీ అంతే. సునీల్ హిట్టుకొట్టి చాలా యేళ్లయిపోయింది. ఈ ముగ్గురికీ ఈ సినిమాతో విజయం సాధించడం అత్యవసరం. అందుకే ప్రతీ విషయంలోనూ.. జాగ్రత్తగా అడుగులేస్తున్నార్ట. స్క్రిప్టు విషయంలో భీమనేని చాలా పక్కాగా ఉన్నాడని, రీమేక్ కథే అయినా.. తెలుగులో వీలైనన్ని మార్పులూ చేర్పులూ చేశారని తెలుస్తోంది. సినిమా మొదలై ఇన్ని రోజులైనా.. దీనికి సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా బయటకు రాలేదు. సినిమా మొత్తం పూర్తయ్యాక.. అప్పుడు మెల్లగా ప్రమోషన్ మొదలెట్టాలని భీమనేని భావిస్తున్నట్టు సమాచారం.