పవిత్ర లోకేష్‌ని తాను వివాహం చేసుకోబోతున్నట్టు నటుడు నరేష్ ఇటీవలే ప్రకటించారు. ఓ వీడియో షూట్ చేసి.. పెళ్లికి టీజర్లా వదిలారు. దాంతో నరేష్ నాలుగో పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. పవిత్ర లోకేష్‌తో ఆయన చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ విషయంపై నరేష్ మూడో భార్య రమ్య చాలా సార్లు గొడవ చేసింది. మీడియా ముందుకు వచ్చింది. కోర్టు మెట్లు ఎక్కింది. ఆఖరికి.. నరేష్, పవిత్రలు ఓ హోటెల్ గదిలో ఉన్నప్పుడు స్టింగ్ ఆపరేషన్ టైపులో.. వాళ్లపై సడన్ గా కెమెరాలతో దాడి చేసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది.
నరేష్ – పవిత్రల ప్రీ మ్యారేజ్ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో… అప్పుడు రమ్యతో గొడవ సమసిపోయిందేమో అనుకొన్నారంతా. కానీ.. ఇప్పుడు ఆమె మళ్లీ బయటకు వచ్చింది. నరేష్ పెళ్లి జరగనివ్వనని మంగమ్మ శపథం చేసింది. తాను ఇప్పటికీ నరేష్ భార్యనే అని, ఇద్దరూ విడాకులు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. అంటే.. విడాకులు తీసుకోకుండానే నరేష్ పవిత్రతో పెళ్లికి సిద్ధమయ్యాడన్నమాట. భార్యతో విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకోవడం చట్ట రీత్యా నేరం. ఈ లాజిక్ తెలిసి కూడా నరేష్ ఎందుకు తొందరపడ్డాడో…? పైగా అదేదో గప్ చుప్‌గా చేసుకోకుండా ఓ వీడియో కూడా రిలీజ్ చేసి, పబ్లిసిటీ ఎందుకు పెంచుకొన్నాడో?
రమ్య.. నరేష్ నుంచి భారీ మొత్తంలో భరణం ఆశిస్తోందని, అందుకే ఇంత రచ్చ జరుగుతోందని అంతా అనుకొన్నారు. కానీ ఇక్కడ మేటర్ భరణం కూడా కాదని తెలుస్తోంది. డబ్బులతో సమసిపోయే వ్యవహారం అయితే ఇంత వరకూ కాదని, దాన్ని… బయటే నరేష్ సెటిల్ చేసుకొనేవాడని, ఈ విషయం ఇగోలకు పోయిందని, అందుకే ఎవరూ తగ్గడం లేదని ఇన్ సైడ్ వర్గాల టాక్.