జూ.ఎన్టీఆర్ బావమరిది, లక్ష్మీ ప్రణతి సోదరుడు యంగ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఆదివారం ఆయన నిశ్చితార్థం శివానితో జరిగింది. శివాని కి వెంకటేష్ కుటుంబానికీ దగ్గరి సంబంధం వుంది. వరుసకు మనవరాలు అవుతుంది. అలా దగ్గుబాటి ఫ్యామిలీ కీ, నితిన్ కీ చుట్టరికం కలిసింది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నే నితిన్‌చంద్ర. ‘మ్యాడ్’సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచమై మంచి హిట్ అందుకున్నారు. రెండో సినిమాగా వచ్చిన ‘ఆయ్’ కూడా విజయాన్ని అందుకుంది.