తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ హైదరాబాద్కు అనుసంధానించేలా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. ఇందులో నర్సాపూర్ దగ్గర భారీ జంక్షన్ ప్లాన్ చేశారు. మొత్తం 12 ఇంటర్ చేంజర్లు నిర్మించేలా డిజైన్ చేశారు. ఈ ఇంటర్ చేంజర్లు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మెదక్ వెళ్లే ప్రధాన రహదారిని కనెక్ట్ చేస్తూ నర్సాపూర్ దగ్గర నిర్మించే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి.
ఆర్ ఆర్ ఆర్తో నర్సాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోతాయని రియాల్టీ వర్గాలు అంటున్నాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగుతో నర్సాపూర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం. పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లో ఏడాది కింద వరకూ ఎకరం కోటిన్నర వరకూ ఉండగా ఇప్పుడు అది రెండు కోట్లకు చేరుకుంది. జాతీయ రహదారి నుంచి కాస్త లోపలికి 2 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో కోటి వరకూ పలుకుతోంది.
ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే నర్సాపూర్ సమీపంలో ఇప్పటికే రియల్ వెంచర్లు వెలిశాయి. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియాల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 20 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ధరలున్నాయి. నర్సాపూర్ సమీప పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి 22 వేల రూపాయల వరకు ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.