సినీ నటుడు నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. నర్సింగ్ యాదవ్ ఈరోజు సాయింత్రం 4 గంటలకు ఆయన స్వగృహంలో ప్రమాదవశాత్తూ కింద పడిపోయారని, దాంతో తలకు గాయాలై ఆసుపత్రికి చేరుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆయన భార్య స్పందించాల్సివచ్చింది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ రోజు ఉదయం డయాలిసిస్ కూడా ఇచ్చారని, అయితే సడన్గా కోమాలోకి వెళ్లిపోయారని చెప్పారు. తెలుగు సినిమాలో కామెడీ విలన్, కామెడీ రౌడీ పాత్రలకు నర్సింగ్ యాదవ్ ప్రసిద్ధి. చాలా సినిమాల్లో విలన్ గ్యాంగ్ లో ఒకడిగా కనిపించి మెప్పించారు నర్సింగ్.