‘ఛలో’ తరవాత ఐరా సంస్థ నుంచి వచ్చిన సినిమా `@ నర్తనశాల`. ఈసినిమాపై విడుదలకు ముందే చాలా అంచనాలు ఉండేవి. ఫన్ ఫీస్ట్ కాబ్టటి.. బాక్సాఫీసు దగ్గర వర్కవుట్ అయిపోతుందని భావించారు. దానికి తగ్గట్టే రేట్లు పలికాయి. `ఛలో` అమ్మిన దానికంటే ఓ రూపాయి ఎక్కువే అమ్ముకున్నారు ఈసినిమాని. అయితే… బాక్సాఫీసు రిలజ్ట్ మాత్రం తేడా కొట్టేసింది. ఎక్కడా ఓపెనింగ్స్ లేవు. రివ్యూలు కూడా అందుకు తగ్గట్టే వచ్చాయి. `అమ్మమ్మగారి ఇల్లు` వసూళ్ల కంటే… `నర్తనశాల` వసూళ్లే దారుణంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు లెక్క కట్టేశాయి. ఇప్పుడు బయ్యర్లు `ఛలో నర్తన శాల ఆఫీస్` అంటున్నారు. నిర్మాతలపై బయ్యర్లు ఇప్పుడు ఒత్తిడి పెంచుతున్నార్ట. `సినిమాని తక్కువలో తీసి ఎక్కువ రేట్లకు అమ్మారు.. మా డబ్బులు మాకు సెటిల్ చేయండి` అంటూ గోల చేస్తున్నార్ట. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు వీరి నాయుడు `నర్తనశాల` కొన్నవారిలో ఒకరు.ఇలాంటి పెద్ద పెద్ద పంపిణీదారులు ఉండబట్టే.. నిర్మాతలపై మరింత ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ పంచాయితీ ఛాంబర్ వరకూ వెళ్లే ఛాన్సుందని తెలుస్తోంది. `ఛలో`తో నిర్మాతలకు, పంపిణీదారులకు బాగానే గిట్టుబాటు అయ్యింది. ఇప్పుడు ఆ లాభాలనే కాదు, పెట్టుబడిని సైతం నర్తన శాల ఎగరేసుకుపోయింది.