2021 ఏడాదికి సంబంధించి 69వ జాతీయ పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. పుష్ప చిత్రానికి గాను ఈ అవార్డ్ కైవశవం చేసుకున్నారు.అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ కైవసం చేసుకున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. 2004లో ‘ఆర్య’తో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో ‘ఆర్య 2’తో అలరించారు. ఆడియో పరంగా కూడా ఆ రెండు సినిమాలు దాదాపు సూపర్ హిట్లు. 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేసిన ‘పుష్ప’ ఇప్పుడు అవార్డుల పంట పండించింది. ఈ చిత్రంలో పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి, ముఖ్యంగా శ్రీవల్లి, నా సామి, ఊ అంటావా పాటలు ఒక ఊపు ఊపేశాయి. మొత్తానికి ఆర్యతో ఒక ఉప్పెనలా వచ్చిన సుక్కు బన్నీ దేవి కాంబినేషన్లో నే ఇప్పుడు దేవిశ్రీ జాతీయ అవార్డ్ అందుకున్నారు.