జాతీయ అవార్డుల ఎంపిక పై ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యూరీ పక్షపాత బుద్దికి ఇది నిదర్శనమని, వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉందంటూ మురుగదాస్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మురుగదాస్ చేసిన ట్వీట్ చిత్రసీమలో కలకలం రేపుతోంది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే మురుగదాస్, ఇలా అవార్డుల విషయంలో మాత్రం తన నిరసన గళం ఏదో ఓ రూపంలో వినిపిస్తూనే ఉంటారు. ఈసారి ఆయన జాతీయ అవార్డుల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేయడం మాత్రం షాక్ ఇస్తోంది.
జాతీయ అవార్డుల ఎంపిక, జ్యూరీ నిర్ణయాలు సాధారణంగానే ఎవ్వరికీ రుచించవు. పైరవీలకు లొంగిపోతారని, సొంత రాష్ట్రాలకే అవార్డులు పట్టుకెళ్లిపోతారని విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. చాలా మంది దర్శకులు, నిర్మాతలు, సినీ మేధావులు జాతీయ అవార్డుల విషయంలో ఎప్పటి నుంచో తమ నిరశస గళం వినిపిస్తూనే ఉన్నారు. వాళ్లలో మురుగదాస్ కూడా చేరిపోయారన్నమాట. ఇక మీదట ఎవరెలా స్పందిస్తారో చూడాలి.
#NationalAwards
Can clearly witness the influence & partiality of people in jury, it's biased.— A.R.Murugadoss (@ARMurugadoss) April 8, 2017