సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ… వివిధ జాతీయ టీవీ చానళ్లు చిత్ర విచిత్రమైన అంకెలతో.. సర్వేలు విడుదల చేస్తున్నాయి. ఒకదానికి మరో దానికి పొంతన ఉండటం లేదు. అసలు సర్వే మెకానిజం ఏమిటో ఎవరికి తెలియదు. ఏ ఓటర్.. బీ ఓటర్.. సీ ఓటర్.. వీఎంఆర్.. అంటూ.. టీవీ చానళ్లు తమ మీదకు రాకుండా మరో పేరును తగిలించి… అంకెల్ని ప్రకటించేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అంచనాలను కూడా వెల్లడిస్తున్నారు. అయితే.. ఏ ఒక్కరి సర్వేనూ.. నమ్మలేనంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే… ఫలితాల్ని తారుమారు చేయగల ఓ ప్రధాన పార్టీగా ఉన్న జనసేన ఉనికిని ఇంత వరకూ ఏ ఒక్క సర్వే కూడా అంచనా వేయలేదు. సీట్లు గురించి కాకపోయినా.. ఓటింగ్ గురించి కూడా చెప్పడం లేదు.
నిన్నామొన్నటి వరకు వచ్చిన సర్వేల్లో అదే చెప్పారు. తాజాగా… వీఎమ్మార్ అనే సంస్థ సర్వేలోనూ.. వైసీపీకి ఏకంగా 23 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. పోలింగ్ పర్సంటేజీలు కూడా ఇచ్చారు. బీజేపీకి 4.8 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.5 శాతం ఓట్లు వేసిన ఆ సర్వే.. కనీసం జనసేన ఉనికి అంగీకరించే ప్రయత్నం చేయలేదు. దీన్ని బట్టి చూస్తేనే ఆ సర్వే.. ఆ చానల్ లేదా… ఆ వీఎమ్మార్ అనే కంపెనీ.. ఒక వేళ అది సూట్ కేస్ కంపెనీ అయితే.. ఏ ఫుట్‌పాత్ మీదో… ఆ లెక్కలు రాసి ఉంటారు. వారికి ఏపీలో క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలియదు కాబట్టి… తమకు అందిన “లెక్క” ప్రకారం.. ఈ సర్వేల విలువ లెక్క గట్టి ఉండవచ్చు. ఏ విధంగా చూసినా… జనసేన పార్టీని ప్రస్తుత రాజకీయాలల్లో తోసిపుచ్చలేము. పవన్ కల్యాణ్‌కు.. ఫ్యాన్ బేస్ మాత్రమే కాదు.. ఓ వర్గంలో ఆయనకు క్రేజ్ ఉంది. అది ఓట్లు తెచ్చి పెడుతుంది.
ఈ సర్వేలో కామెడీ ఏమిటంటే.. బీజేపీకి ఐదు శాతం వరకూ ఓట్లు.. కాంగ్రెస్‌కు రెండున్నర శాతం వరకూ ఓట్లు వస్తాయట. ఓ నాయకుడు కానీ… మరో క్యాడర్ కానీ.. లేని ఆ పార్టీలే అంత సాధిస్తే.. జనసేన ఎంత సాధించాలి..?. దీన్ని బట్టి అర్థమయిందేమిటంటే.. పవన్ కల్యాణ్ కూడా.. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రత్యేకంగా పీఆర్వోనో.. మరో వ్యవస్థనో ఏర్పాటు చేసుకుని జాతీయ మీడియాకు దగ్గరవ్వాలి. వారిని కాకా పట్టి… తనకు ఓట్ల శాతంతో పాటు.. సీట్లు కూడా.. వచ్చేలా చూసుకోవాలి. అయితేనే.. కనీసం..జగన్‌లా..ఎన్నికలకు ముందు.. కాసింత కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలరు. లేకపోతే.. ఈ జాతీయ మీడియా.. జనసేనను అసలు పట్టించుకోదు.