ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన స్థానికత ప్రతిపాదించినకి కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను విజయవాడ లేదా గుంటూరు తరలింపుకి అవరోధంగా మారిన ఈ స్థానికత సమస్యని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపించింది. దాని ప్రకారం 2017, జూన్ 2లోగా ఆంధ్రప్రదేశ్ వచ్చి స్థిరపడేవారికి, వారి పిల్లలకి కూడా స్థానికులుగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా వారు కూడా స్థానిక ప్రజలతో సమానంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది కనుక రాష్ట్రపతి ఆమోదం పొందడం ఇంక లాంఛనప్రాయమేనని భావించవచ్చును. ఇది అమలులోకి వచ్చినట్లయితే హైదరాబాద్ లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులు, వారి పిల్లల భవిష్యత్ గురించి ఇంక ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు కనుక విజయవాడ తరలిరావచ్చును.