విశాఖలో స్థలం ఇవ్వలేదు.. విజయనగరంలో ఓ మరుమూల ప్రాంతంలో సభ పెట్టుకున్నారు. బస్సులివ్వలేదు.. రైళ్లలో వచ్చారు. ప్రైవేటు బస్సులు మాట్లాడుకుని వచ్చారు. కార్లు..బైకులు మీద వచ్చారు. చివరికి సర్వీస్ ఆటోలు పట్టుకుని వచ్చారు. లక్షలాది మంది యువగళం నవశకం సభకు వచ్చారు. పార్టీ నేతలు ఎంత మందిని సమీకరణ చేశారో.. అంతకు రెండింతలు స్వచ్చందంగా తరలి వచ్చారు. టీడీపీ, జనసేన కలిస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. పోలిసపల్లి సభ కనివినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయింది.
యువగళం ముంగింపు సభ.. జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పడేలా సాగింది. రాజకీయ సభను ఇంత ప్రణాళికాబద్దంగా నిర్వహించవచ్చా అని ఆశ్చర్యపోయేలా సభ జరిగింది. సభలో మాట్లాడిన వారంతా సూటిగా.. పగ్రజలకు సందేశం ఇచ్చారు. ప్రజలు పడుతున్న కష్టాలను వారికి గుర్తు చేసే ప్రయత్నం చేయలేదు. వారి కోసం మేమున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం.. యువత కోసం మేమున్నామని కలసి వస్తున్నామని భరోసా ఇచ్చారు. జనాల్ని పీడించుకుని తిని.. ఇప్పుడు ెమ్మెల్యేలను మారుస్తామని అంటున్నారని..మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని.. జగన్ రెడ్డినేనని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ తన సహజసిద్దమైన ఆవేశానికి భిన్నంగా ప్రసంగించారు జగన్ రెడ్డి పాలనలో అరాచకాల్ని గుర్తు చేశారు. కలిసి పోటీ చేస్తోంది ప్రజల కోసమేనన్నారు. నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. పంచ్‌లు.. ప్రాసలతో హోరెత్తించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పాదయాత్ర పూర్తి చేశానన్న సంతృప్తి ఆయనలో కనిపించింది. జగన్ రెడ్డిపై పోరాటంలో విజయం సాధించబోతున్నామన్న ఆత్మవిశ్వాసం కనిపించింది. చివరిగా మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని..రాష్ట్రాభివృద్ధిని పరుగులుపెట్టిస్తామన్నారు.
అన్నింటికన్న మిన్నగా ప్రజలకు భద్రత, భరోసా వారి ఆస్తులకు రక్షణ.. భవిష్యత్ కు గ్యారంటీ ఇస్తామని భరోసా ఇచ్చారు. మొత్తంగా యువగళం – నవశకం సభతో.. టీడీపీ, జనసేన ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజ్లో ప్రారంభించాయని అనుకోవచ్చు.