లిప్పులాకుల్లో టాలీవుడ్ బాలీవుడ్ ని స్ఫూర్తిగా తీసుకొంది. ఈమధ్య.. ఆ స్థాయినే దాటేస్తోంది. ఏ సినిమా తీసుకొన్నా.. ముద్దుల పరంపరే. ఇప్పుడు మరో ఘాటు ముద్దు తగిలింది. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన సినిమా చందమామ రావె. ప్రియల్ గోర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్లో ముద్దు సీనే హైలెట్. నవీన్ చంద్ర, ప్రియల్ గోర్ మధ్య తెరకెక్కించిన లిప్ లాక్ చాలా ఘాటుగా ఉంది. ఆ షాట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా…. ఆ ముద్దు తీవ్రత వెండి తెరపై తీవ్రంగానే ఉండబోతోందన్న విషయం అర్థమైంది.
అందాల రాక్షసి తరవాత.. నవీన్‌కు అవకాశాలు బాగానే వచ్చినా హిట్టు పడలేదు. ఈసారి ఎలాగైనా సరే.. హిట్టు కొట్టాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు. గడ్డం ఇంకాస్త పెంచి.. తన జుత్తును పిలకగా మార్చాడు. చూడ్డానికి స్టైలీష్ గానే ఉన్నాడు. కాకపోతే.. మరీ మాసీగా కనిపిస్తున్నాడు. ధర్మ – రక్ష అనే కవలసోదరులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాని చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. త్వరలోనే పాటల్ని బయటకు తీసుకొస్తారు. ఈ లిప్పు లాక్కు గురించిన మరిన్ని ఇంట్రస్టింగ్ సంగతులు ఈలోగా తెలుస్తాయేమో చూడాలి.