లాక్ డౌన్ సమయంలో ఇళ్ల పట్టునే ఉన్న దర్శకులు – కొత్త వ్యాపకాలతో కాలక్షేపం చేశారు. పూరి, కొరటాల, త్రివిక్రమ్ లాంటివాళ్లయితే – కొత్త కథలు రాసుకున్నారు. కొరటాల శివ కూడా ఓ వెబ్ సిరీస్ కోసం కథ పూర్తి చేశారు. తన శిష్యుడిని ఈ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అమేజాన్ కోసం ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని సమాచారం. ఇప్పటికే అమేజాన్ తో డీల్ సెట్టయిపోయిందట. బడ్జెట్ లెక్కలన్నీ ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది.
అయితే ఈ వెబ్ సిరీస్ లో కనిపించేది ఎవరు? అనే విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పుడిప్పుడే నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్లో కథానాయకుడిగా నవీన్ పొలిశెట్టిని ఎంచుకున్నారని టాలీవుడ్ టాక్. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో ఆకట్టుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఇటీవలే `జాతి రత్నాలు` సినిమా పూర్తి చేశాడు. తన చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు కొరటాల కథలో నటించడానికి ఒప్పుకున్నాడట. కథానాయిక, మిగిలిన నటీనటుల్ని ఎంపిక చేశాక… పూర్తి వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారు.