పంజాబ్ కాంగ్రెస్ కూడా తెలంగాణ కాంగ్రెస్ మాదిరే ముఠా తగాదాలతో రోడ్డునపడింది. చివరికి రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న కెప్టెన్ అమరీందర్ కన్నా… సిద్దూలోనే కాంగ్రెస్ భవిష్యత్‌ను గాంధీలు చూడటంతో… ఆయనకు పీసీసీ చీఫ్‌గా చాన్సిచ్చారు. అచ్చంగా తెలంగాణలో కూడా ఇదే తరహాలో జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడినా.. చివరికి.. మూడున్నరేళ్ల కిందట వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీకి మళ్లీ జవసత్వాలు ఇవ్వగలరన్న అంచనాతో ఆయనకే పదవి ఇచ్చారు. ఆయన కూడా తెలివిగా… తనను వ్యతిరేకించిన వారినందర్నీ మంచి చేసుకునేందుకు ప్రమాణస్వీకారానికి ముందే భేటీలు ప్రారంభించారు.
ప్రతీ రోజూ సీనియర్ల ఇళ్లకు వెళ్లి.. మంచిమాటలు చెప్పి వచ్చారు. తాను వారికి వ్యతిరేకం కాదని.. వారి అవకాశాలకు అడ్డం కాదని చెప్పి వచ్చారు. దీంతో చాలా మంది సైలెంటయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రకటనలు రావడంతో లేదు. ఈ పద్దతిని కాంగ్రెస్ హైకమాండ్ సూచించిందో… లేక.. రేవంత్ ఫార్ములా బాగుందని సిద్ధూ ఫీలయ్యారో కానీ.. ఆయన కూడా అదే బాట ఎంచుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ కీలక నేతల ఇళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగాతనను వ్యతిరేకించిన వారి ఇళ్లకు వెళ్లి కలిసి… పని చేద్దామని సూచిస్తున్నారు. తాను ఎవరి అవకాశాల్ని దెబ్బతీయబోనని హామీ ఇస్తున్నారు. దీంతో… నిన్నటి వరకూ సిద్ధూ … ఉంటాడా.. వెళ్లిపోతాడా అన్నట్లుగా జరిగిన ప్రచారానికి తెరపడిపోయినట్లయింది.
నిజానికి.. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీ పరిస్థితి దారుణంగా మారింది. మిత్రపక్షం అకాలీదళ్ కూడా కటిఫ్ చెప్పేసింది.ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఆప్ నుంచే కాస్త పోటీ కనిపిస్తోంది. ఈ సందర్భంగా.. గెలుపు అవకాశాలు ఉన్న పంజాబ్‌లో పీసీసీ పీఠం అంటే.. ఎన్నికల తర్వాత సీఎం పీఠం అందుకున్నట్లేనని అంచనా వేస్తున్నారు. అందుకే్ సిద్ధూ పట్టుబట్టి పీసీసీ పీఠం సాధించారు. కాస్త నాన్చినా.. చివరికి కాంగ్రెస్ హైకమాండ్.. డైనమిక్ లీడర్లకే బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తోంది.