ఉద్యోగ, ఉపాధి కల్పనలో ముందు ఉండే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రక్షించేందుకు ఏపీ సర్కార్.. నవోదయం అనే పథకం ప్రవేశ పెట్టింది. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పరిశ్రమలనే కాదు.. గతంలో మూతపడిన పరిశ్రమలను ప్రారంభించేందుకు ఆర్థిక చేయూత ఇవ్వడానికి నవోదయం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో కొత్త కాన్సెెప్ట్ ఏమిటంటే.. ఈ ఎంఎస్ఎంఈలు ఉత్పత్తి చేసే వాటిలో ప్రతి ప్రభుత్వ విభాగం ఏటా 25 శాతం తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దాంతో ఆ పరిశ్రమలకు.. మార్కెటింగ్ సమస్య చాలా వరకూ తీరిపోనుంది.
ఆంధ్రప్రదేశ్లో 81వేల చిన్న తరహా పరిశ్రమలు.. రుణాలు చెల్లించలేకపోకపోయాయి. వాటికి రుణాలు అందని పరిస్థితి. ఇలాంటి పరిశ్రమలకు రూ. 2300 కేటాయించి.. ప్రభుత్వం కొత్త రుణాల్ని ఇస్తోంది. వారు మళ్లీ తమ కార్యకలాపాలు ప్రారంభించి.. ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఎంఎస్ఎంఈల కోసం మరో పన్నెండు కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని జగన్ ప్రకటించారు. ఇందులో భాగంగా పారిశ్రామిక ప్రోత్సాహ బకాయిలను చెల్లించారు. కొత్త రుణాలు.. విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలను రద్దు చేయడం లాంటివి ఉన్నాయి. మొత్తంగా పదకొండువేలకుపైగా చిన్న తరహా పరిశ్రమలు నవోదయంతో మళ్లీ ప్రారంభం కానున్నాయి.
ఇప్పటికే కొంత విడుదల చేసిన ఏపీ సర్కార్.. ఈ నెల 29న మిగిలిన మొత్తం విడుదల చేయనున్నారు. అలాగే కొత్త టర్మ్ రుణాలకు ప్రభుత్వం హామీగా ఉండనుంది. బ్యాంకులు కూడా వాటికి విరివిగా రుణాలిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో దాదాపుగా 10 లక్షల మందికి ఉపాధి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో.. వాటి మనుగడ కష్టంగా మారింది. సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా సంస్థల ఉత్పత్తుల్లో పాతిక శాతం ప్రభుత్వ శాఖలే కొనుగోలు చేయాలనే ఆదేశం విప్లవాత్మకమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.