తమిళంలో ఇటివలే విడుదలైన చిత్రం మామన్నన్. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులోకి నాయకుడు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ ని వదిలారు.
ఈ చిత్రానికి దర్శకుడు మరిసెల్వరాజ్, గతంలో కర్ణన్ లాంటి హార్డ్ హిట్టింగ్ సినిమాని అందించాడు. ఇప్పుడు నాయకుడు కూడా అదే తరహా చిత్రంని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
ట్రైలర్ మంచి కవిత్వం మొదలౌతుంది. ”నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాట నేను జీవితాంతం పడుతూ వుండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెదుకుతున్నాను” ఈ ప్రారంభ వాక్యాలు ఆకట్టుకునేలా వున్నాయి.
ఇదొక రాజకీయ వర్గ పోరాటం. వడివేలు, ఉదయనిధి స్టాలిన్ ఒక వర్గం, ఫహద్ ఫాసిల్ మరో వర్గం వీరి మధ్య ఎలాంటి పోరాటం జరిగింది అనేది ఇందులో ప్రధాన కథాంశం. ప్రతి పాత్రలో ఒక సీరియస్ నెస్ వుంది. ఓడివేలు కొత్తగా కనిపించారు. ఫాహద్ మరో కీలక పాత్రలో కనిపించాడు. రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ మధ్య తమిళంలో విజయవంతమై తెలుగులో విడుదలైన విడుదల సినిమా ఇక్కడ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు నాయకుడు కి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. జూలై 14న ఈ సినిమా విడుదలౌతుంది.