నయనతార చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటుంది. ఓవర్ మేకప్ అస్సలు ఇష్టం ఉండదు. తెరపై ఉన్నంత సేపు పద్ధతిగా కనిపిస్తుంది. శ్రీరామ రాజ్యం తరవాత ఆమెలో వచ్చిన మార్పు ఇది. అనామికలోనూ చాలా డీసెంట్‌గా తెరపై దర్శనమిచ్చింది. ఈలోగా చేసిన కొన్ని తమిళ చిత్రాల్లోనూ నయన గెటప్‌లో, ఆమె కనిపించిన విధానంలో ఏమాత్రం మార్పుల్లేవు. అయితే బాబు బంగారంలో మాత్రం నయన సరికొత్తగా కనిపిస్తోంది. ఆమె లుక్.. కాస్ట్యూమ్స్ అన్నీ కొత్తనయనను పరిచయం చేశాయి. గత కొంతకాలంగా నయన రూపు రేఖల్లో పెద్దగా వచ్చిన మార్పుల్లేవు. ఏ సినిమాలో చూసినా ఒకేలా కనిపిస్తోంది. తన లుక్ తనకే బోర్ కొట్టించిందేమో, ఈ సినిమాలో మాత్రం కాస్త శ్రద్ధ పెట్టింది.
మరోవైపు దర్శకుడు మారుతికి కలర్ విజన్‌పై మాంఛి గ్రిప్ ఉంది. బేసిగ్గా.. మారుతి ఓ ఆర్టిస్ట్. అందుకే.. తన సినిమాలో కథానాయిక ఎలా ఉండాలో డిజైన్ చేసుకొన్నాడు. అందుకు తగ్గట్టుగానే నయన కాస్ట్యూమ్స్ మారాయి. ఆమెలో కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఇంతకాలమైనా.. ఆమెలో గ్రేస్ తగ్గలేదంటే.. కచ్చితంగా అద్భుతమే. అందుకే అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవి కూడా ‘నయన’ పేరు తారక మంత్రంలా జపిస్తున్నారు. టీజర్లోనే నయన ఇంతలా ఆకట్టుకొందంటే, ఇక సిల్వర్ స్ర్కీన్‌పై ఎలా వెలిగిపోతుందో?