కోలీవుడ్ క్రేజీ బ్యూటీ నయనతార మరోసారి ప్రేక్షకులను బయపెట్టేందుకు రెడీ అవుతుంది.. లాస్ట్ ఇయర్ మాయ (తెలుగులో మయూరి)గా వచ్చి కాసుల వర్షం కురిపించిన నయన్ అదే ఫార్ములాతో మరోసారి బయపెట్టేందుకు రెడీ అయ్యింది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న నయనతార సినిమా చేస్తుంది అంటే అది సూపర్ హిట్ అన్నట్టే అనే పరిస్థితి నెలకుంది. ప్రేక్షకుల అభిరుచి మేరకే సినిమాలను తీస్తూ సూపర్ హిట్స్ కొట్టేస్తుంది నయన్. హారార్ కామెడీ థ్రిల్లర్ సినిమాలకు మంచి విజయాన్ని అందచేస్తున్న ఈ తరుణంలో దర్శక నిర్మాతలు ఆ జానర్ లోనే సినిమాలు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కోలీవుడ్ దర్శకుడు సర్గురు సినిమాస్ అధినేత సర్గురు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రామసామి ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో నయనతారకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా నిర్మించబడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఈ సినిమాను నిమిజంద్ జపక్ నిర్మాణంలో హిందేష్ జపక్ నిర్మిస్తున్నారు.
కథానాయికా ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో తంబిరామయ్య, హరీష్ ఉత్తమ్ ముఖ్య పాత్రలు పోశించనున్నారు. వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది మరి మరోసారి ప్రేక్షకులను బయపెట్టేందుకు వస్తున్న నయనతార ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.