నయనతారలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. తనని లేడి సూపర్ స్టార్ అని పిలవద్దని నిన్న అభిమానులని కోరింది. ఈ రోజు తన కొత్త సినిమా ముకూతి అమ్మన్ 2 ఓపెనింగ్ కి హాజరైయింది. నయన్ సినిమా లాంచింగ్ కి రావడం అంటే మామూలు విషయం కాదు. కెరీర్ బిగినింగ్ లో ఏమో కానీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఆమె సినిమా వేడుకలకు, ప్రమోషన్ హాజరు కాలేదు. సినిమా ప్రమోషన్స్ తో తనకి సంబంధం లేదని ముందే అగ్రీమెంట్ రాయించుకుంటుంది. అలాంటిది ఇప్పుడు సినిమా లాంచింగ్ ఈవెంట్ లో కనిపించడం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.
నయనతార ఈమధ్య కాలంలో కొన్ని వివాదాలు ఎదురుకుంది. తను నటించిన కొన్ని సినిమాలు ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకతని ఎదురుకున్నాయి. అలాగే హీరో ధనుష్ తో కూడా ఆమెకు విబేధాలు వచ్చాయి. నయన్ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ పై కోట్లలో దావా వేశాడు ధనుష్. ఈ విషయంలో ఆమెకు ధనుష్ ఫ్యాన్స్ కి మధ్య వార్ నడిచింది. అయితే ఈ మొత్తం ట్రోలింగ్ లో అందరూ ఒకే విషయాన్ని ఎత్తి చూపారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ నిర్మాత కష్టాలు అర్ధం చేసుకోకుండా, ప్రమోషన్స్ కి వెళ్ళకుండా, సినిమాపై కనీస భాద్యత లేకుండా నయన్ వ్యవహరిస్తుందనే కామెంట్స్ సర్వత్రా వినిపించాయి. బహుసా ప్రజల్లో తనపై వున్న ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్ ని పోగొట్టడానికి తనలో కొన్ని మార్పులు చేసుకుందేమో కానీ మొత్తానికి తన సినిమా వేడుకలో కనిపించింది. నయన్ లో ఈ మార్పు మున్ముందు కొనసాగితే నిర్మాతలకి ఇంతకంటే ఏం కావాలి.