నయనతార పెళ్లి మేటరేం.. కొత్త విషయం కాదు. చాలాసార్లు… ఈ విషయంపై చర్చ జరిగింది. తన ప్రియుడు కమ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఎప్పటి నుంచో సహజీవనం చేస్తోంది నయన్. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా వీళ్లే జట్టుగా కనిపిస్తున్నారు. వారిద్దరి పెళ్లిపై చాలాసార్లు రూమర్లు వచ్చాయి. ఇప్పటికే వీళ్ల పెళ్లి అయిపోయిందని, అఫీషియల్ గా మాత్రం ఖరారు చేయలేదని చెప్పుకున్నారు. అయితే.. ఇప్పుడు వీళ్ల పెళ్లి నిజంగానే జరగబోతోందట. ఫిబ్రవరిలో నయన్ – విఘ్నేష్‌ల పెళ్లి ఖాయమని, ఇప్పటికే వీళ్ల పెళ్లికి.. ఇరు కుటుంబ సభ్యులూ అంగీకరించారని, ఫిబ్రవరిలో ఓ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీళ్ల పెళ్లి జరగబోతోందని, త్వరతోనే… నయన్- విఘ్నేష్ కలిసి ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తమిళ మీడియా కోడై కూస్తోంది. 2020 చివర్లోనే వీళ్ల పెళ్లి జరుగుతుందనుకున్నారు. అయితే.. కోవిడ్ భయాలు, పరిమితులు ఇంకా పోకపోవడంతో.. 2021 వరకూ ఆగాల్సివచ్చింది. మరి ఈసారైనా ఈ వార్త నిజమో, లేదంటే.. ఇంకొన్నాళ్లు ఈ సహజీవనం కొనసాగిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.