నాయట్టు రీమేక్ ఆగిపోయింది. మలయాళంలో మంచి విజయం సాధించి, విమర్శకుల ప్రశసంలు పొందిన చిత్రం నాయట్టు. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని గీతా ఆర్ట్స్భావించింది. కరుణకుమార్ ని దర్శకుడిగా ఎంచుకుంది. రావు రమేష్, అంజలి లాంటి తారాగణం ఈ టీమ్ లోకి వచ్చారు. కరుణ కుమార్ స్క్రిప్టు కూడా పూర్తి చేశాడు. క్లాప్ కొట్టి… లాంఛనంగా సినిమానీ ప్రారంభించారు. ఆల్మోస్ట్ షూటింగ్ మొదలు అనగా.. ఈ రీమేక్ కి బ్రేక్ పడింది. రీమేక్ రైట్స్ విషయంలో గీతా ఆర్ట్స్‌కి… మలయాళ నిర్మాతలకూ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకే ఈ నాయట్టు రీమేక్ పక్కన పెట్టేశారని టాక్. కరుణ కుమార్ ఈ ప్రాజెక్టులోంచి బయటకు రావడం, మరో సినిమా కోసం ప్రయత్నాలు మొదలెట్టడం కూడా జరిగిపోయాయి. రీమేక్ రైట్స్ పై ఓ స్పష్టత వచ్చినా… భవిష్యత్తులో కూడా ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ లేదని, గీతా ఆర్ట్స్ ఈ సినిమా చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని, ఒకవేళ రీమేక్ హక్కులు గనుక చేతులు మారితే.. అప్పుడు ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.