ఎన్టీఆర్ బాగా ఇష్టపడిన పాత్రల్లో అల్లూరి సీతారామరాజు ఒకటి. అల్లూరి జీవితాన్ని సినిమాగా తీయాలని ఆయన చాలా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్‌కి పోటీగా కృష్ణ `అల్లూరి సీతారామరాజు` సినిమా తీసి.. సూపర్ హిట్ కొట్టాడు. కృష్ణ చేసిన పాత్ర, సీతారామరాజుగా ఆయన నటన ఎన్టీఆర్‌కీ బాగా నచ్చింది. అందుకే… ఆ కథని ఎన్టీఆర్ మళ్లీ తీయలేదు. అయితే… ‘మేజర్ చంద్రకాంత్’లో మాత్రం వివిధ గెటప్పులు వేసిన ఎన్టీఆర్.. అందులోనే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గెటప్ కూడా వేసేసి తన ముచ్చట తీర్చుకున్నాడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోనూ ‘అల్లూరి సీతారామరాజు’ ఎపిసోడ్ ఒకటుంది. అందుకోసం బాలయ్య అల్లూరి గెటప్‌లోకి మారబోతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అల్లూరి గెటప్‌లో ఉన్న బాలయ్యతో ఓ సన్నివేశాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ప్రతీ పండక్కీ ఓ లుక్‌ని విడుదల చేయడమే పనిగా పెట్టుకున్న ఎన్టీఆర్ బృందం.. ఈ దీపావళికి కూడా ఓ లుక్ విడుదల చేయబోతోంది. అది అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. 2019 సంక్రాంతికి `ఎన్టీఆర్` బయోపిక్ విడుదల కాబోతోంది. తొలి భాగాన్ని జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న విడుదల చేస్తారు.