నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలయ్య , పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత చాలా కధలు వున్నారు బాలయ్య. కృష్ణవంశీ, శ్రీవాస్, కేఎస్ రవికుమార్, ఎస్వి కృష్ణా రెడ్డి… ఇలా చాల మందిపేర్లు ఆయన కొత్త సినిమా కోసం వినిపించాయి. అయితే పూరి జగన్నాధ్ సడన్ ఎంట్రీ ఇచ్చి సినిమా ఖాయం చేసుకున్నారు. అయితే ఇప్పుడీ సినిమా కథ విషయంలో గాసిప్పులు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవికి అటో జానీ కధ చెప్పాడు పూరి. ఆయనకి సెకెండ్ హాఫ్ ఎక్కడో తేడాకొట్టింది. ఇప్పుడు అదే స్టోరీని బాలయ్యతో తీస్తున్నాడని, ఇందులో బాలయ్య టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.
ఇంకో గాసిప్ ఏమిటంటే.. ఈ సినిమా కోసం పూరి ఓ హాలీవుడ్ సినిమాని పట్టుకొచ్చాడని ప్రచారం జరుగుతోంది. ”జాన్ విక్’ అనే హాలీవుడ్ సినిమా స్పూర్తిగా పూరి, బాలయ్యకు కథ రాసాడని మరో గాసిప్ వినిపిస్తుంది. జాన్ విక్ సినిమా గురించి చెప్పుకుంటే ఇదో యాక్షన్ థ్రిల్లర్. చాలా ఇంట్రస్టింగ్ గా ఉటుంది. ఒక కారు చుట్టూ కథ తిరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నీవేషాలు వుంటాయి ఇందులో. ఇటివలే ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా లైన్ నే బాలయ్యకు కోసం రాసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే దాని కోసం చాలా మార్పులు చేయాలి. ఆ సినిమా బావున్నా ఇక్కడ నేటివిటికి సెట్ కాని కధ అది, అందులోనూ’జాన్ విక్’ క్యారెక్టర్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ సరిపొతుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్ధకమే. కొన్ని సీన్స్ వాడుకుంటే ఓకే కాని స్టోరీ లైన్ వాడుకుంటే మాత్రం చాలా మార్పులు జరగాలి. అయితే, అసలు ఇంతకి జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియాల్సివుంది. మరి దీనిపై పూరి క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.