నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం. ఈ చిత్రం నుండి బాలయ్య బర్త్ డే కానుకగా ఫస్ట్ హంట్ పేరుతో టీజర్ బయటికి వచ్చింది. టీజర్ లో బాలయ్య అభిమానులకు కావాల్సిన అంశాలనీ వున్నాయి. యాక్షన్ పీక్స్ లో వుంది. మూడు డైలాగులు పవర్ ఫుల్ గా పేలాయి.
మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్..
భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే..
నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా ..ఈ మూడు డైలాగులు అభిమానులు విజల్స్ వేసేలానే వున్నాయి.
అంతా బాగానే వుంది కానీ ఈ టీజర్ పాటు టైటిల్ ని కూడా ప్రకటిస్తారని అభిమానులు ఎదురు చూశారు. ఐతే ఈ సారికి కేవలం టీజర్ తోనే సరిపెట్టారు బాలకృష్ణ. ఈ చిన్న అసంతృప్తి తప్ప టీజర్ మాత్రం సాలిడ్ గా వుంది.