గత ఐదేళ్ల కాలంలో బీజేపీతో వైసీపీ సన్నిహితంగా వ్యవహరించింది. కేసుల భయం దానికి ప్రధాన కారణం. అయితే తాము అడ్డగోలుగా సహకరిస్తున్నాం కాబట్టి.. రాజకీయ అవసరాలకు మీరు కూడా సహకరించాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం… రాష్ట్రం కోసం రూపాయి ఎప్పుడూ సాధించలేదు కానీ.. రాజకీయ అవసరాల కోసం మాత్రం చాలా ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. బీజేపీ .. వైసీపీకి సహకరించడనికి ప్రధాన కారణం లోక్ సభ ఎంపీలు కాదు.. రాజ్యసభ ఎంపీలు.
ఏ కీలక బిల్లు పాస్ కావాలన్నా.. రాజ్యసభలో వైసీపీ అవసరం పడుతూ వస్తోంది. దీంతో బీజేపీ కాస్త తగ్గి వ్యవహరించింది. ఇప్పుడు బీజేపీకి వైసీపీ అవసరం తీరిపోయింది. ఎన్డీఏకు పూర్తి బలం రాజ్యసభలో చేకూరింది. ఎన్నికలు జరిగిన రాజ్యసభ సీట్లలో అత్యధికం బీజేపీ గెల్చుకుంది. ఏప్రిల్ లో పదవి విరమణ చేసే వారి కన్నా ఎక్కువగా బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఏప్రిల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేసిన తర్వాత రాజ్యసభలో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ వస్తుంది.
ఇక వైసీపీకి పదకొండు మంది రాజ్యసభసభ్యులు ఉన్నారు. వీరి అవసరం ఇక బీజేపీ ఉండదు. అయినా .. వైసీపీకి బీజేపీతో సన్నిహితంగా ఉండటం తప్ప.. మరో ఆప్షన్ లేదు. ఏం చేసినా.. బీజేపీ ని అంటి పెట్టుకుని ఉండాల్సిందే. ఎందుకంటే.. అన్ని కేసులు ఉన్నాయి మరి. అయితే.. బలమైన పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానించాలనుకుంటున్న బీజేపీ… ఇప్పుడు వైసీపీ అవసరం ఇక లేదని డిసైడవుతుందా..లేకపోతే ఆ పార్టీనే చేర్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.