చిరంజీవి ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. మూడు పార్టీలు కలిసి ఏపీకి మంచి చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అని.. గెలిపించాలని కోరారు. ఈ మేరుక సీఎం రమేష్, పంచకర్ల రమేష్ లతో కలిసి వీడియోను విడుదల చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫిల్మ్ ఇండస్ట్రీని ఇబ్బందులు పెట్టిన వైసీపీ సర్కార్ పై .. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం పూర్తిగా వ్యతిరేకంగా మారింది.
జగన్ రెడ్డి తల్లి, చెల్లిని దూరం చేసుకున్నట్లే అందర్నీ దూరం చేసుకున్నారు. అందులో తనకు మద్దతు పలికిన సినిమా వాళ్లు కూడా ఉన్నారు. గతంలో తనకు మద్దతు పలికిన అలీ, ఫృధ్వీతో పాటు కొంత మంది ఆర్టిస్టుల్ని పట్టించుకోలేదు. మోహన్ బాబును అయితే పార్టీలో చేర్చుకుని మరీ మోసం చేశారు. ఇప్పుడు తనకు ఏ పార్టీతో సంబంధం లేదని వారు చెబుతున్నారు. అలీ ప్రచారానికి కూడా వెళ్లే ఉద్దేశంలో లేరు. ఫృధ్వీ జగన్ పై విరుచుకుపడుతున్నారు.
ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన చిరంజీవిని కూడా రాజకీయంగా వాడుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నించారు. ఓ సారి ఇంటికి పిలిచి భారతీతో వడ్డించి.. రాజ్యసభ సీటిస్తాం తీసుకోవాలన్నారు. ఆయన వద్దంటే.. మరోసారి ప్రముఖ హీరోలందర్నీ పిలిచి అవమానించి పంపారు. ఇలాంటి ఘోరాలను చూసిన ఇండస్ట్రీ.. జగన్ రెడ్డికి మద్దతు పలికేందుకు సిద్ధంగా లేదు. ఆయనకు వ్యతిరేకంగా హీరోలు తమ ఫ్యాన్స్ కు సందేశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Megastar Chiranjeevi supports NDA alliance
" తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు మరియు బిజెపి నాయకత్వం ఒక కూటమి గా రావడం మంచి పరిణామం.
అలాగే CM రమేష్, పంచకర్ల రమేష్ లు మంచి వ్యక్తులు. వారిని గెలిపించండి " pic.twitter.com/SmRv2bY9sI
— Telugu360 (@Telugu360) April 21, 2024