రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో అనుకున్నట్లుగానే ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి..జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజార్టీకి 123 మంది సభ్యులు అవసరం. దాని కన్నా బీజేపీ కూటమి అభ్యర్థికి రెండు ఓట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ తరపున నిలబడిన బీకే హరిప్రసాద్ పరాజయం పాలయ్యారు. ఆయనకు 105 ఓట్లు వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడయిన.. హరివంశ్ … మొదటిసారి రాజ్యసభకు వచ్చారు. అయినా తొలి టర్మ్‌లోనే… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఫలితాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించగానే అన్ని పక్షాల నేతలు ఆయనను అభినందించారు.
ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయమని నిన్న సాయంత్రానికే క్లారిటీ వచ్చింది. 13 మంది ఎంపీలున్న అన్నాడీఎంకే, 9 మంది రాజ్యసభ సభ్యులున్న బిజూజనతాదళ్.. ముందుగానే మద్దతు ప్రకటించడంతో.. ఎన్డీఏ విజయం ఖరారయిది. బిజూజనతాదళ్ మద్దతు కోసం… కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాను జేడీయూ నేత నితీష్‌కుమార్‌కు మాటిచ్చేశానని.. ననీన్ పట్నాయక్.. కాంగ్రెస్ నేత.. ఆజాద్‌కు చెప్పారు. ఇక టీఆర్ఎస్ కూడా అధికారికంగా తమ విధానాన్ని బయటకు చెప్పకపోయినా..నేరుగా సభలో ఓటింగ్ ద్వారా వెల్లడించింది.
తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పిన వైసీపీ ఎంపీలు.. చివరి క్షణంల యూటర్న్ తీసుకున్నారు. ఓటింగ్‌కు గైర్హాజర్ అయ్యారు. దీంతో విపక్షాల అభ్యర్థికి ఓట్లు తగ్గిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు తృణమూల్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ, సీపీఐ, జేడీఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. వైసీపీ, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు గైర్హాజర్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి 105 ఓట్లు మాత్రమే వచ్చాయి.