ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా `సైరా` ఫస్ట్ లుక్, టీజర్ విడుదల అవుతున్నాయి. ఒక రోజు ముందే అంటే… ఆగస్టు 21నే `సైరా` టీజర్ చూసేయొచ్చు. మరోవైపు రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని సైతం విడుదల చేసే అవకాశం ఉందని చెప్పుకున్నారు. అయితే చరణ్ లుక్ ఇప్పట్లో రాదట. టైటిల్ కోసం కూడా కొన్ని రోజులు ఆగాలట. చిరు పుట్టిన రోజు సందర్భంగా చరణ్ సినిమాకి సంబంధించిన లుక్ గానీ, టైటిల్‌గానీ విడుదల చేయాలని భావించిన మాట నిజమేనని, అయితే… ఇప్పుడు చిత్రబృందానికి అలాంటి ఆలోచనలు లేవని తెలుస్తోంది. చరణ్ సినిమా టైటిల్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కొన్ని టైటిళ్లు పరిశీలనలో ఉన్నా.. మరింత మెరుగైన మాసీ టైటిల్ కోసం బోయపాటి ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. చిరు పుట్టిన రోజు కోసమని కంగారు కంగారుగా టైటిల్‌ని ప్రకటించకూడదని బోయపాటి భావిస్తున్నాడట. పైగా ఆ రోజు `సైరా` టీజర్ మాయలో ఉంటారంతా. కాబట్టి.. తన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌లకు తగినంత ప్రచారం ఉండదేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే… వీలు చూసుకుని టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌నీ వదులుదామన్న నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. గురువారం భారీ వర్షం కారణంగా షూటింగ్ రద్దు చేసుకోవాల్సివచ్చింది. ఈరోజు యధావిధిగా షూటింగ్ జరగబోతోంది.