భానుమతి పాత్రతో అందర్నీ ఫిదా చేసి పరేసింది.. సాయి పల్లవి. కథలో ప్రాధాన్యం ఉన్న నాయిక పాత్రల్ని తను సమర్థంగా పోషించగలనని నిరూపించింది. కణం దాదాపుగా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయి నాయికా ప్రాధాన్యం ఉన్న కథలూ ఆమె కోసం తయారవుతున్నాయి. ‘నీది నాది ఒకే కథ’తో ఆకట్టుకున్న దర్శకుడు వేణు ఉడుగుల. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘ప్రస్తుత సమాజానికి అవసరమైన సినిమా ఇది’ అంటూ సినీ మేధావులు కితాబులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు ఓ లేడీ ఓరియెంటెడ్ కథతో సిద్ధమయ్యాడని తెలుస్తోంది. సాయి పల్లవిని దృష్టిలో ఉంచుకుని ఓ కథ సిద్ధం చేశాడట వేణు. ‘నీది నాది ఒకే కథ’ చూసిన వాళ్లెవరైనా సరే.. వేణుకి ఓ అవకాశం ఇస్తారు. ఈ కథకు సాయి పల్లవి ఫిదా అయిపోతే.. ఈ దర్శకుడి లైన్ క్లియర్ అయిపోయినట్టే. సాయి పల్లవి నటించిన ‘కణం’ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.