ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న నీలం సహాని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలంటూ.. ఏపీ సర్కార్ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. వాస్తవానికి ఆమె జూన్ 30వ తేదీన రిటైరవ్వాల్సి ఉంది. కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంలో కీలకంగా ఉంటున్నందున..ఆమె పదవీ కాలం ఆరు నెలలు పొడిగించాలని.. ఏపీ సర్కార్ కోరింది. ఏపీ సర్కార్ విజ్ఞప్తిని అంగీకరించిన కేంద్రం.. పొడిగింపు ఇచ్చింది.అయితే.. ఆరు నెలలు ఇవ్వలేదు. .. కేవలం మూడు నెలలు మాత్రమే ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీతో ఆ పొడిగింపు పదవీ కాలం ముగుస్తుంది. అందుకే ఇప్పుడే ప్రతిపాదన పెట్టారు. ఒక వేళ అనుమతి రాకపోతే.. కొత్త సీఎస్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మామూలుగా.. ఇటీవలి కాలంలో రిటైరయ్యే ఎవరికీ.. కేంద్రం పొడిగింపు ఇవ్వడం లేదు. కరోనా కట్టడి చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కొంత మందికి మాత్రం మినహాయింపు ఇచ్చి. కేంద్ర ప్రభుత్వంలో హెల్త్ సెక్రటరీగా ఉన్న ప్రతీసూడాన్ అనే అధికారి పదవీ కాలం కూడా ఏప్రిల్‌లో ముగిసింది. కానీ ఆమెకూ మూడు నెలల పొడిగింపు ఇచ్చారు. ఇప్పుడు .. ఆమెకు పొడిగింపు ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె రిటైర్ కానున్నారు. కేంద్రంలో హెల్త్ సెక్రటరీగా ఉన్న అధికారికే పొడిగింపు ఇవ్వకపోతే.. ఇక ఏపీ సీఎస్‌కు మాత్రం ఎలా ఇస్తారనే వాదన అధికారవర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం నీలం సహాని సీఎస్‌గా.. ఒత్తిడిగా ఎదుర్కొంటున్నారు. కోర్టు తీర్పులను అమలు చేయకపోవడంతో.. పలు రకాల ధిక్కారణ పిటిషన్లను ఎదుర్కొంటున్నారు. ఎస్ఈసీ విషయంమలో.. ప్రస్తుతం… ప్రమాదం అంచున ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా.. హెచ్చరికలు పంపింది. రేపు శుక్రవారంలోపు ఆ ఆదేశాలు అమలు కాకపోతే.. చీఫ్ సెక్రటరీనే బలయ్యే ప్రమాదం ఉంది. ఓ వేళ రిటైరైనా… ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.