టాలీవుడ్ పాపులర్ క్యాస్టూమ్ డిజైనర్ లో కోన నీరజ ఒకరు. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో నితిన్‌కి స్టైలిస్ట్‌గా తొలిసారి పని చేసింది. అందులో నితిన్ లుక్, ఫ్యాషన్ కొత్తగా అనిపించింది. దాంతో నీరజ పేరు తెరపైకి వచ్చింది. అలాగే సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్ గా కూడా ఆమె పేరు తెచ్చుకుంది.
నీరజ కు రచన పై కూడా ఆసక్తి వుంది. కొన్ని పాటలు రాసింది. ఇప్పుడామె మెగా ఫోన్ పడుతుంది. దర్శకురాలిగా మారుతోంది. సిద్ధు జొన్నల గడ్డ కథానాయకుడిగా నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమా ఓకే అయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించనుంది. ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్ తో బిజీగా వున్నాడు సిద్ధు. ఈ సినిమా తర్వాత నీరజ సినిమా సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.